- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆస్ట్రోనాట్స్ గాయాల్ని తగ్గించే ‘ స్కిన్ బయోప్రింటర్’
దిశ, ఫీచర్స్ : స్పేస్‌ఎక్స్ డ్రాగన్ రీసప్లయ్ స్పేస్‌క్రాఫ్ట్ ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ISS) ఇటీవల వెళ్లిన విషయం తెలిసిందే. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లో సైన్స్ ప్రయోగాలు, క్రూ సప్లయ్స్, డిటర్జెంట్, స్కిన్ బయోప్రింటర్‌తో సహా శాస్త్రీయ ప్రయోగాలకు అవసరమైన అనేక ఇతర సరుకులను కూడా పంపించారు. ఇటువంటి మిషన్స్ అసాధారణం కానప్పటికీ, అంతరిక్షంలో చాలా నెలలు గడిపే వ్యోమగాములు నిత్యావసరాల కోసం ప్రయోగాలు చేయడం ఆసక్తికరం. స్పేస్ స్టేషన్‌కు డ్రాగన్ అందిస్తున్న సైన్స్ ప్రయోగాల్లో ఇంట్రెస్టింగ్‌గా కొన్ని వస్తువులుండగా.. అందులో బయోప్రింటింగ్ బ్యాండేజ్ విశేషమేంటో తెలుసుకుందాం.
సింథటిక్, నేచురల్ బిల్డింగ్ బ్లాక్‌ల నుంచి కృత్రిమ చర్మాన్ని రూపొందించడంలో ‘స్కిన్ బయోప్రింటింగ్’ ఉపయోగపడుతుందని తెలుసు. అయితే భూమిపైన పరిస్థితులకు, రోదసి వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ గాయమైతే దాన్ని నయం చేయడంలో బ్యాండేజ్‌లు బాగా పనిచేస్తాయి. కానీ రోదసిలో వీటి పనితీరు ఎలా ఉంటుందో పరిశోధకులు తెలుసుకోవాలనుకున్నారు. అయితే గాయమైనప్పుడు చర్మం ఎలా నయం అవుతుందో రోగనిరోధక ప్రతిస్పందన, పర్యావరణ మార్పులతో సహా బహుళ కారకాల ద్వారా నిర్ణయించబడుతుంది. అందువల్ల పీడనం, గురుత్వాకర్షణ, పర్యావరణ కూర్పు భిన్నంగా ఉన్నందున, భూమికి విరుద్ధంగా అంతరిక్ష నౌక లేదా చంద్రుని వాతావరణంలో గాయం హీలింగ్ ప్రాసెస్ భిన్నంగా ఉంటుంది. ఈ క్రమంలోనే బయోప్రింటింగ్ రూపొందించే కణజాల బ్యాండేజ్‌లు గాయపడిన లేదా దెబ్బతిన్న సైట్‌లను మాన్పించడంలో సహాయపడతాయి.
బయోప్రింటింగ్ బ్యాండేజెస్ :
బయోప్రింటర్, ఇది పోర్టబుల్ హ్యాండ్‌హెల్డ్ పరికరం కాగా ఇది కణజాలం-ఏర్పడే ప్యాచ్‌ను రూపొందించేందుకు ఒక వ్యక్తికి చెందిన సొంత చర్మ కణాలను ఉపయోగిస్తుంది. గాయాలను కవర్ చేసేందుకు, వైద్య ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ బ్యాండేజ్‌లను ఉపయోగించనున్నారు. చంద్రునితో సహా అంగారక గ్రహానికి భవిష్యత్తులో చేసే మిషన్లలో బయోప్రింటింగ్ సేవలు ఉపయోగించుకోనున్నారు. అంతరిక్షంలో సంభవించే గాయం నయం చేయడంలో ఇది సహాయపడుతుండగా, ఈ బ్యాండేజ్‌లు అవసరమైన చోట సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన చికిత్సను అందిస్తాయి. పెద్ద గాయాలు సంభవించినప్పుడు గాయం ఇన్ఫెక్షన్‌ను త్వరగా నివారించి వ్యోమగామి అంతరిక్షంలో తిరిగి వారి విధులను నిర్వహించేందుకు సహకరిస్తుంది.