- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏసీబీ వలలో డిప్యూటీ తహసీల్దార్..

దిశ, జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తాహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న బస్వరాజ్, వీఆర్ఏ వీరన్న లను సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నట్లు మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. కోహిర్ మండలానికి చెందిన ఓ రైతు ఖాస్రా, పాణ, ఆర్వోఆర్ నకలు కాపీలను ఇవ్వడానికి రెండు వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు.
దీంతో సదరు రైతలు ఏసీబీని ఆశ్రయించడంతో రైతు వద్ద నుంచి లంచం తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు తమ సిబ్బంది ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో డిప్యూటీ తహసీల్దార్ బస్వరాజ్, వీఆర్ఏ వీరన్న ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఆనంద్ కుమార్ వెల్లడించారు. ఆ ఇరువురు రెవెన్యూ శాఖ ఉద్యోగుల పై కేసు నమోదు చేసి తదుపరి చర్యలకు ఉపక్రమిస్తు న్నామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ దాడిలో అవినీతి నిరోధక శాఖ ఇన్‌స్పెక్టర్ లు రమేష్, వెంకట్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.