- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహాపాదయాత్ర ఓ దగాయాత్ర.. డిప్యూటీ సిఎం ధర్మాన
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతియే ఉండాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులు చేస్తున్న యాత్ర దగాయాత్ర అంటూ ఆయన విమర్శించారు. అంతేకాదు రియల్ ఎస్టేట్ యాత్ర.. భ్రమరావతి యాత్ర అంటూ ఆరోపించారు. పాదయాత్రకు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే అన్నీ చంద్రబాబేనని ఆరోపించారు.
అమరావతి భూములకు బినామీ చంద్రబాబేనని.. ఈ ఉద్యమానికి బినామీ కూడా ఆయనేనన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కడ చూసినా ఈ టీడీపీ నాయకులు, శ్రేణులే ఉన్నారు. ఈ యాత్ర చేయిస్తున్నది నేనే అని చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. ఒక అన్యాయం నుంచి మరిన్ని అన్యాయాలకు దారి తీయాలని చంద్రబాబు చేసే ప్రయత్నాలకు మారుపేరుగా ఈ యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
‘13 జిల్లాలు, మిగతా ప్రాంతాలు, మిగతా సామాజిక వర్గాల వారిని కవ్విస్తూ యాత్ర సాగిస్తున్నారు. ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇవ్వటానికి వీల్లేదని అడ్డుకోవటం, చివరికి విశాఖపట్టణంలో ఏ ఒక్క నిర్మాణం జరగటానికి వీల్లేదని స్టీలు తీసుకురావటం ఉత్తరాంధ్ర ప్రయోజనాలమీద దండయాత్ర కాదా? అని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల సమానాభివృద్దికి మా నాయకుడు సీఎం వైయస్ జగన్ కట్టుబడి ఉన్నారు.
మేనిఫెస్టోలో ఆయన ఏం చేస్తామని చెప్పారో దాన్ని దైవంగా భావించి చేసి చూపిస్తున్నారు’ అని అన్నారు. తాము రైతుల పాదయాత్రకు వ్యతిరేకం కాదన్న ఆయన రాజకీయ రంగు పులుముకున్న యాత్రకే తాము వ్యతిరేకమని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు.