- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంట్రాక్టే లేనప్పుడు వాట్సాప్ గ్రూప్‌లో ఎందుకుండాలి..?
దిశ, స్పోర్ట్స్ :
క్రికెటర్లందు పాకిస్తానీ క్రికెటర్లు వేరయా.. అని అందరూ అంటుంటారు. ఎందుకంటే… ఆ దేశానికి చెందిన క్రికెటర్లు ఆనందం కలిగినా, కోపం వచ్చినా విపరీతంగా స్పందిస్తుంటారు. ఇండియన్ క్రికెటర్లలో ఎవరైనా జాతీయ కాంట్రాక్టు కోల్పోతే నోరెత్తి ఒక మాట అనగలరా..? ధోనీ వంటి సీనియర్ క్రికెటర్ కాంట్రాక్ట్ కోల్పోతే కనీసం ఒక్కవ్యాఖ్య కూడా చేయలేదు. కానీ, పాకిస్తాన్ క్రికెటర్లు మాత్రం విరుచుకపడుతున్నారు. ఇటీవల సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన మహ్మద్ అమీర్, హసన్ అలీ తమ అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కాంట్రాక్టులో లేనప్పుడు కోచ్ కమ్ చీఫ్ సెలెక్టర్ మిస్బా ఉల్ హక్ ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో మాత్రం ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తున్నారు. లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఆటగాళ్లకు ఫిట్‌నెస్, శిక్షణ తదితర తాజా సమాచారాన్ని చేరవేసేందుకు, క్రికెటర్లతో టచ్‌లో ఉండేందుకు ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. అయితే మాకు కాంట్రాక్ట్ దక్కనప్పుడు ఈ గ్రూప్‌లో ఉండాల్సిన అవసరం లేదంటూ.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. కాగా, కాంట్రాక్టు జాబితాలో లేని ఆటగాళ్లను కూడా టీమ్ సెలెక్షన్‌కు పరిగణిస్తామని మిస్బా ఉల్ హక్ చెప్పిన తర్వాత కూడా వీళ్లు మాత్రం సదరు వాట్సాప్ గ్రూప్ నుంచి నిష్క్రమించడం చర్చకు దారితీసింది.