- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి.. PDSU
by Shyam |
X
దిశ, సిద్దిపేట: ఇంటర్ ఫలితాల వల్ల మరణించిన విద్యార్థుల మరణాలకు నైతిక బాధ్యత ప్రభుత్వానిదే అని పీడీఎస్‌యు సిద్దిపేట జిల్లా కమిటి ఆరోపించింది. విద్యార్థుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ విద్యా శాఖ మంత్రి, ఇంటర్ బోర్డ్ సెక్రటరీ రాజీనామా చేయాలని వారు గజ్వేల్ ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థులకు పాఠాలు బోదించకుండానే, పరీక్షలు పెట్టి ఫెయిల్ చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందని వారు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 404 ఇంటర్ కాలేజ్‌లు ఉంటే.. పాస్ పర్సంటేజ్ మాత్రం 30% కూడా లేదని ఆరోపించారు. తక్షణమే ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
Advertisement
Next Story