- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిన్న మర్కజ్… నేడు స్పెషల్ ఆపరేషన్
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు తమ దగ్గరి కొవిడ్ కేసుల గురించి ప్రతిరోజు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ ప్రభుత్వం తమ ఏప్రిల్ 11 నాటి బులెటిన్‌లో ఒక చిన్న మార్పు చేసింది. ఏప్రిల్ 10 వరకు మర్కజ్ మసీద్ వద్ద కరోనా అంటుకున్న వారి కేసులు మర్కజ్ మసీదు కేసులు అనే కేటగిరిలో ప్రచురించింది. కానీ ఏప్రిల్ 11 నాటి నుంచి బులెటిన్లో మర్కజ్ మసీదు పేరును రాయలేదు. దాని స్థానంలో స్పెషల్ ఆపరేషన్ కేటగిరీ అని ప్రచురించింది.
ఢిల్లీ నిజాముద్దీన్ దగ్గరి మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్ ఈవెంట్ భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులను ఒక్కసారిగా పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం తమ హెల్త్ బులెటిన్‌లో మర్కజ్ మసీదు కేసులు అని ప్రస్తావించింది. దీనికి ముస్లింలు మనోభావాలు దెబ్బతినడంతో ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ వారు ఆరోగ్య శాఖను ఆశ్రయించారు. వారి వినతి మేరకు ఇలా పేరు మార్చే నిర్ణయాన్ని అమలు చేసినట్లు తెలుస్తోంది.
Tags: Corona, Health ministry, Tablighi, Jamaat, Marka, Health Bulletin, Government