సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ ఇష్టం : దీపికా

by Shyam |
సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ ఇష్టం : దీపికా
X

బాలీవుడ్ దివా దీపికా పదుకొనె.. సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. ఈ మధ్య ఒక అభిమాని పంపిన లవ్ లెటర్ కూడా షేర్ చేసిన దీపికా.. అప్పుడప్పుడు తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ను మోటివేట్ చేసేందుకు కూడా ప్రయత్నించే ఈ బెంగళూరు బ్యూటీ.. తాజాగా జరిగిన చిట్ చాట్‌లో ఫ్యాన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది.

లాక్‌డౌన్ తర్వాత ఫస్ట్ చేసే పని?
ముందుగా అమ్మానాన్నలను కలవాలి.. తర్వాత బెంగళూరులో ఉన్న సిస్టర్‌ను మీట్ అవ్వాలి

మీలో ఉన్న అసహజమైన ప్రతిభ?
ఆ విషయం నా కన్న భర్త, చెల్లెలిని అడిగితే బాగుంటుంది. ఈ ప్రశ్నకు బెస్ట్ ఆన్సర్ వాళ్ల దగ్గరే దొరుకుతుంది. తప్పకుండా ఈ విషయం గురించి షేర్ చేసుకునేందుకు వాళ్ల దగ్గర ఓ స్టోరీ ఉంటుంది.

ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో మీకు నచ్చిన పాత్ర?
‘పీకు’ సినిమాలోని పీకు పాత్ర చాలా ఇష్టం

కాఫీ లేదా టీ ఇష్టపడతారు?
రెండూ. సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టం. నేను ఇంట్లో తయారు చేసుకునే టీ కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు నేను అమేజింగ్‌గా టీ తయారు చేయగలను

మిగిలిన జీవితంలో ఒక్క డిష్ మాత్రమే తినాలి అంటే ఏది ప్రిఫర్ చేస్తారు?
వైట్ రైస్, రసం, మామిడి కాయ పచ్చడి.. మూడింటి కాంబినేషన్ ఎలాంటి బోర్ లేకుండా లైఫ్ లాంగ్ తినేయొచ్చు

మీ అమ్మ చేతితో చేసిన వంటకాల్లో ఏది ఇష్టం?
తను అన్ని వంటకాలు బాగా చేస్తుంది. తను చేసే అన్ని వంటకాలు ఇష్టమే..

పర్వతాలు లేదా బీచ్ ఏది ఎక్కడం అంటే ఇష్టం?
బీచ్

సోషల్ మీడియా వేదికగా రణ్‌వీర్‌ సింగ్‌కు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు?
ఇప్పటికే 35,000 సార్లు అలారమ్ స్నూజ్ చేయబడింది. బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ మీదే ఉంది వచ్చేయండి.

Advertisement

Next Story