ప్రభాస్ సినిమా కోసం దీపిక డిమాండ్…

by Shyam |
ప్రభాస్ సినిమా కోసం దీపిక డిమాండ్…
X

డార్లింగ్ ప్రభాస్ 20 వ చిత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. 2020 ఎండింగ్ లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా… 2021 ఎండింగ్ లో మూవీ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు దర్శక, నిర్మాతలు.

ప్రభాస్ ఇప్పటికే నేషనల్ లెవెల్ హీరో అయినా సరే… మూవీలో ఇతర క్యారెక్టర్స్ కు అన్ని భాషల్లోని ఆర్టిస్ట్ లను సెలెక్ట్ చేస్తేనే వర్క్ ఔట్ అవుతుంది. దీంతో హీరోయిన్ గా బాలీవుడ్ తార దీపికా పదుకొనేను ఎంచుకుంటే బాగుంటుందని ఆమెను సంప్రదించారట. అయితే దీపికా ఇందుకోసం రూ. 25 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో ఆలోచనలో పడ్డారట నిర్మాత. కాగా పద్మావత్ సినిమాకు రూ. 15 కోట్లు తీసుకున్న దీపికా…. అధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరు. కాగా తాజాగా చపక్ సినిమాతో హిట్ అందుకుంది దీపికా.

Tags: Deepika Padukone, Prabhas, Nag Ashwin, Vyjayanthi movies

Advertisement

Next Story