మామడలో తీవ్ర విషాదం.. యువరైతు ఆత్మహత్య

by Aamani |
Farmer suicide
X

దిశ, నిర్మల్ రూరల్: నిర్మల్ జిల్లా మామడ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధలు తాళలేక యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మామడ ఏఎస్ఐ బిక్కులాల్ వివరాల ప్రకారం.. మండలంలోని తాండ్ర గ్రామానికి చెందిన నాయుడి భీమన్న(40) తనకున్న వ్యవసాయ భూమిలో పత్తిపంట వేశాడు. అధిక వర్షాల కారణంగా పంట దిగుబడి సరిగా రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. ఈ క్రమంలో పంట చేనులోనే చెట్టుకు ఉరేసుకొని మృతి చెందినట్లు ఏఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతుని ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.

Advertisement

Next Story