- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్దిపేటలో సంచలనం.. ఆమె బతికుండగానే భారీ స్కెచ్
దిశ ప్రతినిధి, మెదక్ : ‘సారూ.. ఇంకా నేను బతికే ఉన్నా.. బతికుండగానే నా డెత్ సర్టిఫికెట్ ఎలా జారీ చేస్తారు’ అంటూ ఓ బాధితురాలు అధికారులను నిలదీసింది. బాధితురాలి భూమిని కాజేసేందుకు కొందరు స్కెచ్ వేశారని, అందులో భాగంగానే చంద్రవ్వ చనిపోయినట్టు చిత్రీకరించి డెత్ సర్టిఫికెట్ తీసుకున్నట్లు సమాచారం. దీనిపై తహసీల్దార్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితురాలు చంద్రవ్వ తెలిపిన వివరాల ప్రకారం.. రెండెకరాల భూమిని సదరు మహిళ భర్త చనిపోగానే ఆమెకు పట్టా చేయించి ఇచ్చారు. సమీప బంధువులు భూమిని తమ పేరు మీద పట్టా చేయించుకోవడానికి చంద్రవ్వ డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె.. బంధువులను నిలదీయగా చంపుతామని బెదిరించారు. దీంతో, చంద్రవ్వ అధికారులకు ఫిర్యాదు చేసింది.
ఈ విషయమై మిరుదొడ్డి తహసీల్దార్ భిక్షపతిని వివరణ కోరగా చంద్రవ్వకు భర్త కిష్టయ్య నుంచి సంక్రమించిన భూమిని జూలై 29న విక్రయించినట్లు చెప్పారు. నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన అధికారులపై సమగ్ర విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.