దక్షిణాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్‌గా క్వింటన్ డి కాక్

by Shyam |
దక్షిణాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్‌గా క్వింటన్ డి కాక్
X

దిశ, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్‌గా క్వింటన్ డి కాక్‌ను నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పరిమిత ఓవర్ల జట్లకు కెప్టెన్‌గా ఉన్న డి కాక్‌ను టెస్టు జట్టు బాధ్యతలు కూడా అప్పగించారు. దీంతో ఈ సీజన్‌లో మూడు ఫార్మాట్లకు డి కాక్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. మరోవైపు త్వరలో శ్రీలంక‌తో స్వదేశంలోజరుగనున్న సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టును కూడా బోర్డు ప్రకటించింది. గాయం కారణంగా కసోగి రబాడ, డ్వేన్ ప్రెటోరియస్‌లకు చోటు దక్కలేదు. మరోవైపు సరెల్ ఎర్వీ, గ్లెంటన్ స్టర్‌మన్, కైల్ వెరైన్‌లకు తొలి సారిగా జాతీయ జట్టులో చోటు దక్కింది. ఈ నెల 26 నుంచి శ్రీలంకతో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

దక్షిణాఫ్రికా జట్టు : క్వింటన్ డికాక్ (కెప్టెన్), తెంబా బువామా, ఐదెన్ మార్క్‌రమ్, ఫాఫ్ డు ప్లెసిస్, బ్యూరన్ హెన్రిక్స్, డీన్ ఎల్గర్, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్‌గిడి, రస్సీ వాన్ డస్సెన్, సరెల్ ఎర్వీ, ఎన్రిక్ నోర్జే, గ్లెంటన్ స్టర్‌మన్, వియాన్ మల్డర్, కీగన్ పీటర్సన్, కైల్ వెరైన్

Advertisement

Next Story