- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కొవాగ్జిన్' మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి
దిశ, వెబ్‌డెస్క్: భారత్ బయోటెక్ తో పాటు, ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ కొవాగ్జిన్ ట్రయల్స్ తుది అంకానికి చేరుకున్నాయి. టీకా మూడో దశ ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) నుంచి అనుమతి లభించింది. తొలి రెండు దశల ట్రయల్స్ పూర్తయ్యాయని.. దానికి సంబంధించిన నివేదికను పంపుతూ మూడో దశ ట్రయల్స్ కోసం భారత్ బయోటెక్ డీజీసీఐకి దరఖాస్తు చేసింది.
18 ఏళ్లు దాటిన 28,500 మందిపై మూడో దశ ట్రయల్స్ జరుగుతోందని.. దేశవ్యాప్తంగా 19 పట్టణాల్లో ట్రయల్స్ నిర్వహిస్తామని సంస్థ పేర్కొంది. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో 200 మందికి టీకా ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరో భారత సంస్థ జైడస్ కాడిల్లా, ఆక్స్ ఫర్డ్ విద్యాలయంతో ఆస్ట్రాజెనెకా టీకాలు క్లీనికల్ ట్రయల్స్ వివిధ దశల్లో ఉన్నాయి.
గత నెలలో భారత్ బయోటెక్ సంస్థ కొవిడ్-19 వైరస్‌కు కారణమైన సార్స్-కోవ్-2పై రీసస్ కోతులపై ప్రయోగాలు చేసింది. ఇందులో వ్యాక్సిన్ సురక్షితమైందని తేలింది. వ్యాక్సిన్ యాంటీబాడీలను ఉత్పత్తి చేసినట్లు గుర్తించినట్లు సంస్థ ప్రకటించింది.