భారత్ లో మొదటి శానిటైజ్డ్, సోషల్ డిస్టెన్స్ కారు

by vinod kumar |
భారత్ లో మొదటి శానిటైజ్డ్, సోషల్ డిస్టెన్స్ కారు
X

దిశ, వెబ్ డెస్క్ :
డీసీ 2 డిజైన్ సంస్థ భారతదేశంలో వాహనాలను తయారు చేసే సంస్థల్లో ఒకటి. ఈ సంస్థ ప్రధానంగా కార్లను రీ మోడిఫికేషన్ చేస్తోంది. సెలెబ్రిటీల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు ఎంతోమంది కార్లను డీసీ 2 మాడిఫై చేసింది. ఇటీవల డిసి 2 హిందుస్థాన్ అంబాసిడర్ కారును మోడీఫై చేసి ఔరా అనిపించింది. ఇప్పుడు ఇదే సంస్థ కరోనా నేపథ్యంలో ఓ సరికొత్త కారు డిజైన్ ను రూపొందించింది. కారులో కూర్చునే వారి మధ్య సోషల్ డిస్టెన్స్ ఉండటంతో పాటు, 20 నిముషాలకో సారి కారును శానిటైజ్ చేసే కారును తయారు చేసింది. భారత్ దేశంలో తొలి శానిటైజ్డ్, సోషల్ డిస్టెన్స్ కారును తయారు చేసిన ఘనత డీసీ 2కే దక్కుతుంది.

కరోనా కట్టడితో ముఖ్యమైంది… భౌతిక దూరం పాటించడం. దాంతో పాటు ముఖానికి మాస్క్ ధరించడం. చేతులను శుభ్రంగా కడుక్కోవడంతో పాటు, ఏ వస్తువులను తాకినా.. శానిటైజర్ తో చేతులను రుద్దుకోవడం ప్రధానం. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం ప్రముఖ కార్ల డిజైనింగ్‌ సంస్థ డీసీ2 సరికొత్త కార్‌‌ ఇంటీరియర్‌‌ డిజైన్‌ను రూపొందించింది. దానికి సంబంధించిన ఫోటోలను అధికారిక ఫేస్ బుక్ అకౌంట్లో విడుదల చేసింది. డ్రైవర్ తో పాటు, ప్రయాణికులకు మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా దీని ఇంటీరియర్ ను డిజైన్ చేసింది. అంతే కాకుండా కారులోనే ఎలక్ట్రికల్‌ శానిటైజర్‌‌ను ఏర్పాటు చేసింది. దేశంలోనే ఇలాంటి డిజైన్‌ తయారు చేసిన మొదటి సంస్థ తమేదేననీ కంపెనీ వెల్లడించింది. కారులోనే ఫిజికల్‌ డిస్టెన్స్ పాటించేలా డ్రైవర్‌‌, పక్క సీటుకు మధ్య 6.2 అడుగుల దూరాన్ని పెట్టింది. డ్రైవర్ కు, ప్రయాణికుల మధ్యలో అద్దాన్ని కూడా అమర్చింది. కారులోని శానిటైజర్లు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కారును క్లీన్‌ చేస్తోంది. ఎస్‌యూవీలు, ఎంపీవీ వెహికల్స్ అయిన టయోటా ఇన్నోవా, ఫార్చునర్‌‌, మెర్సిడెస్‌ విక్లాస్, కియా కార్నివాల్, మహీంద్రా మరాజ్జో తదితర కార్లలో ఇప్పటికే దీనికి సంబంధించి ట్రైయల్స్‌ చేశామని సంస్థ నిర్వాహకులు చెప్పారు. లగ్జరీ కార్లయినా.. ఆడీ ఏ8, క్యూ7, మెర్సిడెస్ జీఎల్ఎస్, బీఎండబ్ల్యూ, జాగ్వార్, రేంజ్ రోవర్ , రోల్స్ రాయల్స్ వంటి కార్లలోనూ ఆయా సంస్థలు కోరితే ఇటువంటి తరహా మోడల్ చేసి అందిస్తామని సంస్థ అధికారులు తెలిపారు.

Tags: electrick ambassador, social distancing, dc2 design

Advertisement

Next Story

Most Viewed