కరోనా విరాళాలకు చారిటీ మ్యాచ్‌లో ‘బెక్‌హామ్

by vinod kumar |
కరోనా విరాళాలకు చారిటీ మ్యాచ్‌లో ‘బెక్‌హామ్
X

ఇంగ్లాండ్ మాజీ స్టార్ సాకర్ ప్లేయర్ డేవిడ్ బెక్‌హామ్ కరోనాపై పోరాటానికి విరాళాల కోసం చారిటీ మ్యాచ్ ఆడనున్నాడు. తాను సహ యజమానిగా ఉన్న ఇంటర్ మియామీ జట్టు ద్వారా నిధులు సేకరించేందుకు ‘ఆల్ ఇన్ ఛాలెంజ్’ పేరుతో నిర్వహించే మ్యాచ్‌ల్లో బెక్‌హామ్ భాగస్వామి కానున్నాడు. ఒక్కో జట్టులో ఐదుగురు ప్లేయర్లతో ఈ చారిటీ మ్యాచ్ నిర్వహించనుండగా.. దీని ద్వారా ఫ్యాన్స్, సెలబ్రిటీలు, అథ్లెట్లు నిధులు సేకరించవచ్చు. బెక్‌హామ్ జట్టుతో ఆడేందుకు వీళ్లు ఒక జట్టుగా ఫామ్ కావాల్సి ఉంటుంది. ఇలా నిర్వహించే ఆల్ ఇన్ ఛాలెంజ్‌ టోర్నీలో గెలిచిన జట్టుకు బెక్‌హామ్‌తో లంచ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అంతే కాకుండా మియామీ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం కలుగుతుంది. కరోనా కోసం పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడానికే ఈ చారిటీ మ్యాచ్‌లు ఏర్పాటు చేసినట్లు బెక్‌హామ్ తెలిపాడు. దీనికి మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, పారిస్ సెయింట్ జర్మన్ జట్లను కూడా ఆహ్వానించాడు.

Tags: Charity match, In Soccer Player, David Beckham, All in challenge, Fundraising

Advertisement
Next Story

Most Viewed