డేటింగ్ యాప్స్ కు పెరుగుతున్న క్రేజ్

by Sujitha Rachapalli |
డేటింగ్ యాప్స్ కు పెరుగుతున్న క్రేజ్
X

దిశ వెబ్ డెస్క్ : లాక్ డౌన్ వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎన్ని న్యూస్ చానెళ్లు తిప్పినా… కరోనా కథనాలే. ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లలో అన్ని పాత ప్రొగ్రామ్ లే. సోషల్ మీడియాలోనూ కరోనా ముచ్చట్టే. ఈ తరుణంలో .. డేటింగ్ యాప్ వైపు జనాలు దృష్టి పెడుతున్నారు. లాక్ డౌన్ టైమ్ లో డేటింగ్ యాప్ లో పెరుగుతున్న వినియోగదారుల సంఖ్యే అందుకు సాక్ష్యం .

భారత్ లో తొలితరం డేటింగ్ యాప్ లలో క్వాక్ క్వాక్ కూడా ఒకటి.

80 లక్షలకు పైగా యాక్టివ్‌ వినియోగదారులు ఈ యాప్ లో ఉన్నారు. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా కారణంగా ఎవరూ ఇల్లు దాటడం లేదు. ఈ తరుణంలో డేటింగ్ యాప్ క్వాక్ క్వాక్ లో వినియోగదారుల సంఖ్య బాగా పెరిగిందని తాజా లెక్కలు చెప్తున్నాయి. లాక్‌డౌన్‌ ప్రకటన విడుదలైన నాటి నుంచి కూడా ఈ యాప్ లో ప్రతీ రోజు…18,000 మంది కొత్త వినియోగదారులు చేరుతున్నారని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. చాట్‌లు కూడా రోజుకు 3,50,000 నుంచి 5,00,000కు చేరాయని సంస్థ పేర్కొంది. ఇక ఎవరు ఎక్కువగా చేరుతున్నారు అనే దానిని కూడా యాప్ తన లెక్కల్లో పేర్కొంది. 50శాతానికి పైగా మార్కెటింగ్ చేసే వ్యక్తులు, 25శాతం వ్యాపారులు, 25శాతం విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారని సంస్థ యాజమాన్యం తెలపింది. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో వారి ఆదాయం దాదాపు 20 శాతం పెరిగిందని సంస్థ వ్యవస్థాపకుడు రవి పేర్కొన్నారు. క్వాక్ క్వాక్ 2010 లో ప్రారంభమైంది. ఇండియన్ సింగిల్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ యాప్ మొదలుపెట్టారు. ప్రతి నెల 150 లక్షల చాట్స్ ఎక్సేంజ్ జరుగుతాయని రవి అంటున్నారు.

ఆ రెండింటిలోనూ :

ఈ లాక్ డౌన్ పీరియడ్ లో .. టిండర్ , బంబల్ అనే డేటింగ్ యాప్ లలోనూ వినియోగదారుల సంఖ్య పెరిగింది. మార్చి 12 తర్వాత బంబల్ లో రోజుకు చాట్ లలో 21 శాతం పెరుగుదల ఉందని, అదే టిండర్ లో 10-15శాతం మేర పెరిగిందని ఆయా సంస్థలు తెలిపాయి.

ఫేస్ బుక్ :

ఫేస్ బుక్ కూడా ఇటీవలే ‘ట్యూన్డ్’ పేరుతో డేటింగ్ యాప్ ను ప్రారంభించింది. కానీ ఇదో ప్రైవేట్ డేటింగ్ యాప్.. కేవలం కపుల్స్ కు మాత్రమే. ఇందులో ఫోటోలు, వాయిస్ మెసేజెస్, మీమ్స్, చాట్స్ పంపించుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

Tags : corona virus, lockdown, dating app, quack quack, tinder, bumble

Advertisement

Next Story

Most Viewed