- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌ను తొక్కి పెట్టే ప్రయత్నం చేశారు: శ్రవణ్
దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌లో లొసుగులు ఉన్నాయని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీని తొక్కి పెట్టే ప్రయత్నాలు చేశాయని విమర్శించారు. 150డివిజన్లలోని ప్రతి పోలింగ్ బూత్‌లో ఓటింగ్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు సీసీ ఫుటేజ్, వెబ్ కాస్టింగ్ రికార్డు వీడియో డేటా ఇవ్వాలని శనివారం ఆర్టీఐలో దాసోజు శ్రవణ్ పిటిషన్ దాఖలు చేశారు. అన్నివార్డుల్లో బ్యాలెట్ పేపర్‌పై స్వస్తిక్ కాకుండా ఇతర గుర్తు, మార్కు ద్వారా పోలైన మొత్తం ఓట్ల వివరాలు చెప్పాలని కోరారు. గ్రేటర్ పోలింగ్ ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించారని, ఎన్నికల సంఘం విఫలమైందన్నారు. ప్రభుత్వానికి అండగా రాష్ట్రఎన్నికల సంఘం వ్యవహరించిందని, స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ ప్రభుత్వానికి మద్దతుగా నిలువడం దురదృష్టకరమన్నారు.