ఏమైనా సమస్యలుంటే నేరుగా నన్ను సంప్రదించండి : మంత్రి జూపల్లి

by Sumithra |
ఏమైనా సమస్యలుంటే నేరుగా నన్ను సంప్రదించండి : మంత్రి జూపల్లి
X

దిశ, కొల్లాపూర్ : ఏమైనా సమస్యలుంటే ప్రజలు నేరుగా తనను సంప్రదించాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం పట్టణంలోని ఎంజీ కేఎల్ఐ గెస్ట్ హౌస్ లో వివిధ గ్రామాల ప్రజల నుంచి మంత్రి జూపల్లి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు సమస్యలతో వచ్చినప్పుడు అధికారులు పరిష్కరించాలన్నారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలు అధికారుల చుట్టూ తిరగొద్దన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులున్నారు.



Next Story

Most Viewed