- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లాష్ ఫ్లాష్ : NIA అధికారులను బురిడి కొట్టించిన టెర్రరిస్టులు
దిశ, వెబ్‌డెస్క్ :జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులను దర్భంగా బ్లాస్ట్ కేసు నిందితులు బురిడీ కొట్టించారు. NIA అధికారులు విచారణ జరుపుతున్న సమయంలో నిందితులు ఎలక్ట్రానిక్ డివైస్‌లు వాడినట్లు తెలుస్తోంది. మాలిక్ సోదరుల బ్యాగ్‌లు తనిఖీ చేసినపుడు ఎలక్ట్రానిక్ డివైస్‌లను అధికారులు గుర్తించారు. 15రోజుల పాటు నిందితులు బ్యాగులను తమ వెంటబెట్టుకుని తిరిగారు. NIA అధికారుల కదలికలను బయటకు చేరవేసినట్లు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. దర్భంగా రైల్వే స్టేషన్‌ల్లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మాలిక్ సోదరులు ప్రధాన నిందితులు.
వీరు ప్రతీ పేలుడుకు రూ. కోటి ఒప్పందం చేసుకున్నట్లు తెలిసిందే. అందుకోసం హాజీ సలీం, ఇక్బాల్ తో మాలిక్ సోదరులు ఒప్పందం చేసుకున్నారు. వారితో పలుమార్లు ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ మాట్లాడినట్లు సమాచారం. 2012లోనే మాలిక్, హాజీ సలీం కుట్రలకు ప్లాన్ చేశారు. ప్రస్తుతం NIA అధికారుల అదుపులో ఉన్న నిందితులకు ఈనెల 23 వరకు రిమాండ్ కొనసాగనుంది. అయితే, దర్భంగా పేలుళ్ల వెనుక లష్కరే తోయిబా ముఖ్యనేత ఇక్బాల్ హస్తమున్నట్లు NIA తేల్చింది. కాగా, మాలిక్ సోదరుల నుంచి ప్రస్తుతం జీపీఎస్, బ్లూ టూత్, వాకీటాకీలను NIA అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ వివరాలను ఎవరికి చేరవేసారనే కోణంలోనూ NIA దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.