- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బహిరంగంగా శృంగారం చేసుకోవొచ్చంటా.. ఎక్కడో తెలుసా?
దిశ, ఫీచర్స్: స్పానిష్ ఐలాండ్ గ్రాన్ కానరియా.. ఏటా 14 మిలియన్ సంఖ్యలో పర్యాటకులకు ఆతిథ్యమిస్తోంది. ఈ క్రమంలో చాలామంది యాత్రికులు స్థానిక బీచ్‌లు, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటే.. మరికొందరు మాత్రం అక్కడి ప్రాచీన ఇసుక దిబ్బల్లో సెక్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీని వల్ల నేచురల్ సాండ్ సిస్టమ్స్ నాశనమవడమే కాక, వారు వాడిపడేసిన కండోమ్స్ కారణంగా పరిసరప్రాంత జంతువులు మృత్యువాత పడుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
‘డునాస్ డి మస్పలోమాస్ స్పెషల్ నేచర్ రిజర్వ్’ 1982 నుంచి చట్టబద్ధంగా పరిరక్షించబడుతోంది. ఐరోపాలోని నేచురల్ డ్యూన్(దిబ్బ) సిస్టమ్స్‌లో ఇదీ ఒకటి కాగా, శృంగారం కోసం ఇక్కడికి వచ్చేవారు తమకు తెలియకుండానే ఎనిమిది స్థానిక వృక్ష జాతులపై ప్రభావం చూపుతున్నారని గుర్తించారు. అంతేకాదు ఆఫ్రికా నుంచి వలసొచ్చే పక్షులకు విడిదిగా గుర్తింపు పొందిన ఈ ప్రదేశం ప్రస్తుతం డిస్టర్బింగ్‌గా తయారైంది. ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ, గ్రాన్ కానరియా(ULPGC) నిపుణులు ఈ అధ్యయనాన్ని నిర్వహించగా.. రెండు చదరపు మైళ్ల విస్తీర్ణంలో 298 ‘సెక్స్ స్పాట్స్’ కనుగొన్నారు. వృక్షసంపద(నెబ్ఖాస్) చుట్టూ ఏర్పడే దిబ్బలను యాత్రికులు తొక్కడం ద్వారా.. బల్లులు ఒక ప్యాచ్ నుంచి మరొక ప్యాచ్‌కు దూసుకుపోయే వీల్లేకుండా చేశారని తెలిపారు.
ఇంత క్యూట్‌గా ఉండటం నేరమే.. విరుష్క జోడీపై నెటిజన్ కామెంట్
గ్రాన్ కానరియా వార్షిక పర్యాటకాన్ని పరిశీలిస్తే.. దాదాపు 15 శాతం మంది స్వలింగ సంపర్కులే ఉన్నట్టు అధ్యయనం పేర్కొంది. లెస్బియన్లు, హెటిరో సెక్సువల్ మెన్.. తమ సెక్సువల్ యాక్టివిటీస్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ దిబ్బలను ఆశ్రయిస్తారని తెలిపారు. ఆ టైమ్‌లో వారు యూజ్ చేసిన బేవరేజ్ క్యాన్స్, సిగరెట్ పాకెట్లు, టాయిలెట్ పేపర్స్ అండ్ వైప్స్ తదితర చెత్త.. సెక్స్ స్పాట్స్ బీచ్ నుంచి ఎంత దూరం ఉన్నాయో తెలుపుతున్నాయి. మొత్తానికి వీటి వల్ల 10 రకాల మొక్క జాతులు అంతం కాగా.. ఆటోమేటిక్‌గా ఆ ప్రభావం జంతువులు, సరీసృపాలపైనా పడింది. అయితే పబ్లిక్ సెక్స్‌కు స్వస్తి పలకాలని చెప్పడం లేదని, తద్వారా జరిగే నష్ట తీవ్రతను తెలపాలన్నదే తమ ప్రయత్నమని ఎక్స్‌పర్ట్స్ చెబుతుండటం విశేషం.