తీవ్ర విషాదంలో దామోదర రాజనర్సింహ

by Shyam |
తీవ్ర విషాదంలో దామోదర రాజనర్సింహ
X

దిశ, ఆందోల్: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పీఏసీఎస్ డైరెక్టర్ అనిల్ పటేల్ మృతి చెందడంతో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కంటతడి పెట్టారు. మెదక్ జిల్లా రేగోడు మండలం ఆర్ ఇటిక్యాల గ్రామానికి చెందిన అనిల్ పటేల్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం ఆయన స్వగ్రామంలో నిర్వహించిన అంత్యక్రియలకు దామోదర రాజనర్సింహ హాజరై మృతదేహం వద్ద నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చే క్రమంలో ఆయన కూడా బోరున విలపించారు. అనిల్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనిల్ పటేల్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనిల్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. ఆయనతోపాటు ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు.

Advertisement

Next Story