- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘ఆ విషయంపై దళిత ఎమ్మెల్యేలు మాట్లాడాలి’

X
దిశ సిద్దిపేట: ఎస్సీ వర్గీకరణ బిల్లు సాధన కోసం అసెంబ్లీలో మాదిగ ఎమ్మెల్యేలు మాట్లాడాలని ఎమ్ఆర్‌పీఎస్ నారాయణరావుపేట మండల ఇంచార్జ్ కొలిమి మల్లేశం డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మాదిగల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని మండి పడ్డారు. గత అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ వర్గీకరణ చేసి చూపిస్తా అన్న మాటలను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో కెసీఆర్ పైన వర్గీకరణ అంశంపై మాదిగ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని ఎడల మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మరో ఉద్యమానికి సిద్ధం అవుతారని మల్లేశం హెచ్చరించారు.
Next Story