కరోనా ఎఫెక్ట్.. ఆ జిల్లాలో 144 సెక్షన్ అమలు

by Shamantha N |
Corona virus
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాప్తి కారణంగా పబ్లిక్ స్థలాలు, ప్రార్థన స్థలాలు, గార్డెన్స్, మార్కెట్లలో ప్రజలు గుమిగూడవద్దని పోలీసులు తెలిపారు.

తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. కళ్యాణ మండపాల్లో 50 మంది కంటే ఎక్కువ సంఖ్యలో అతిథులు హాజరు కావద్దని హెచ్చరించారు.

Advertisement

Next Story