- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జర్నలిస్టులకు నిత్యావసరాల పంపిణీ !
దిశ, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో పార్ట్‌టైం విలేకరులు, స్ట్రింగర్స్‌కు లాక్ డౌన్ నేపథ్యంలో అండగా ఉండేందుకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్టు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్లూజె – 143) నగర అధ్యక్షులు యోగానంద్, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, టెంజు అధ్యక్షులు సంపత్ తెలిపారు. మాసబ్ ట్యాంక్‌లో గల తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయ ఆవరణలో ఆదివారం మధాహ్నం 12 గంటలకు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చేతుల మీదుగా నిత్యావసరాల పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డ్ ఉన్న కుటుంబాలకు ఇప్పటికే సహాయం అందిస్తున్న నేపథ్యంలో.. తెల్ల రేషన్ కార్డ్ లేని జర్నలిస్టుల కుటుంబాలకు కనీస నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని భావించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం మాస్కులు తప్పనిసరి చేసినందున మాస్కులు, శానిటైజెర్లు కూడా అందజేయనున్నట్టు తెలిపారు.
సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో పార్ట్‌టైం జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారు మాత్రమే నిత్యావసర సరుకుల ప్యాకింగ్ సెట్ పొందడానికి అర్హులన్నారు. ముషీరాబాద్, సికింద్రాబాద్, అంబర్ పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, కంటోన్మెంట్, తార్నాక పార్ట్‌టైం జర్నలిస్టులతో పాటు కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, చిన్న పత్రికల ప్రతినిధులు వచ్చి తమ తమ ప్యాకెట్లను తీసుకువెళ్ళాలని వారు కోరారు. కార్యక్రమానికి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, యూనియన్ ఉపాధ్యక్షులు రమేష్ హజారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, టెంజూ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్ హాజరుకానున్నారు.
Tags : corona effect, tuwj, media academy, allam narayana