- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SBI Yono పేరుతో సైబర్ క్రైమ్.. క్రిమినల్స్‌కే ఊహించని షాకిచ్చిన పోలీసులు
దిశ, కామారెడ్డి: సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఫేక్ మెసేజీలు పంపిస్తూ అమాయకుల నుంచి లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు. డబ్బులు పోయాక తేరుకుంటున్న బాధితులు తాము మోసపోయామని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇలాగే మోసపోగా.. వెంటనే తేరుకున్న బాధితుడు సంబంధిత కాల్ సెంటర్ కు ఫోన్ చేయడంతో స్పందించిన పోలీసులు బాధితుని డబ్బును రికవరీ చేయగలిగారు. దానికి సంబంధించిన వివరాలను పోలీసులు ప్రకటన రూపంలో విడుదల చేసారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డికి చెందిన రాఘవరెడ్డి(పేరు మార్చారు)కి ఈ నెల 6 న +9196353102827 నంబర్ నుంచి మీ ఎస్బీఐ యోనో అకౌంట్ బ్లాక్ అయిందని, అన్ బ్లాక్ కోసం పాన్ కార్డ్ నంబర్ లింకులో నమోదు చేస్తే అప్ డేట్ అవుతుందని మెసేజీ వచ్చింది. దాంతో లింక్ ఓపెన్ చేసిన బాధితుడు యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఎంటర్ చేసున అనంతరం వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయడంతో 60 శాతం అప్ డేట్ అయిందని తర్వాత పాన్ నంబర్ ఎంటర్ చేయగా 70 శాతం అని చూపించింది. ఆ తర్వాత మళ్ళీ ఓటిపి రావడంతో ఓటీపీ ఎంటర్ చేయడంతో 90 శాతం చూపించి కొద్దిసేపటి తర్వాత 100 శాతం అప్ డేట్ అయినట్టుగా చూపించింది.
100 శాతం అప్ డేట్ చూపగానే విడతల వారీగా బాధితుని అకౌంట్ నుంచి 3,39,088 రూపాయలు కట్ అయినట్టుగా మెసేజ్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే 155260 నంబరుకు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దాంతో సైబర్ నేరగాళ్ల ట్రాన్సక్షన్ వివరాలను తనిఖీ చేయగా ఫ్లిప్ కార్ట్ లో షాపింగ్ చేసినట్టుగా గుర్తించారు. వెంటనే పోయిన 3.39,088 రూపాయల నుంచి 3,09,099 రూపాయలను రికవరీ చేసి బాధితుని అకౌంట్లో జమ చేయించడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఏ బ్యాంక్ అయినా అప్ డేట్ కోసం అడగవని, మోసపూరిత మెసేజీలలో వచ్చిన లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలను కోరారు. అలాంటిది ఏదైనా జరిగితే 24 గంటల లోపు 155260 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే నగదును రికవరీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.