- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగారు వ్యాపారి ఇంట్లో ఏసీబీ సోదాలు
దిశ, ఏపీ బ్యూరో: ఒంగోలులో వైఎస్ఆర్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి సన్నిహితుడిగా పేరొందిన ప్రముఖ బంగారు వ్యాపారి ఇంట్లో బుధవారం అర్ధరాత్రి వరకు కస్టమ్స్ అధికారుల తనిఖీలు చేశారు. నిన్న ఉదయం తమిళనాడులోని ఎలావూర్ చెక్ పోస్టు వద్ద రూ.4 కోట్ల నగదుతో పాటు బంగారం పట్టుబడింది. లాక్‌డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా అక్రమ బంగారం బిజినెస్ భారీ ఎత్తున జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాట పట్టుబడిన కారు పై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్టిక్కర్ ఉండటంతో ఆయనకు సంబంధించిన వాహనంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వెంటనే స్పందించిన మంత్రి బాలినేని పట్టుబడిన వాహనానికి తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కారుపై తన పేరుతో జిరాక్స్ స్టిక్కర్లు వాడారని..వాహనంలో పట్టుబడిన సొత్తుతో తమకు సంబంధం లేదని తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని మంత్రి బాలినేని సూచించారు. ఈ నేపథ్యంలో కస్టమ్స్ దాడులు జరగడం ఆసక్తి రేపుతోంది.