రెండ్రోజుల్లో 3,500 కి.మీ.లు!

by Anukaran |   ( Updated:2020-09-28 07:12:20.0  )
రెండ్రోజుల్లో 3,500 కి.మీ.లు!
X

దిశ, వెబ్‌డెస్క్: మనిషి నడుచుకుంటూ వెళ్లాడనో, సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడనో అనుకోకండి. ఈ 3500 కి.మీ.లు వెళ్లింది ఎవరో తెలిస్తే మీరు షాకవుతారు. మరీ అంతగా కాకపోయినా కొద్దిగా షాకవుతారు. ఎందుకంటే రెండ్రోజుల్లో 3500 కి.మీ.లు ప్రయాణించినది ఒక కుకూ (కోయిల జాతికి చెందిన పక్షి). అవును.. ఈ సాధారణ పక్షి ఇంత అసాధారణంగా ప్రయాణిస్తుందని ఆర్నిథాలజిస్టులు కూడా అస్సలే అనుకోలేదు. ఇంతకీ ఈ కుకూ పేరెంటో తెలుసా? ఓనన్. దీని ప్రయాణాన్ని కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు 2019లో దీనికి ట్రాన్స్‌మీటర్‌లు అమర్చారు. ఆ ట్రాన్స్‌మీటర్‌ల నుంచి తీసిన డేటా ఇప్పుడు ఈ నిజాలను బయటపెట్టింది. ఇంతకీ కథేంటంటే..

మంగోలియాలోని ఖుర్ఖ్ బర్డ్ రింగింగ్ స్టేషన్‌కు చెందిన శాస్త్రవేత్తలు జూన్ 2019న ఐదు కుకూలకు ట్రాన్స్‌మీటర్‌లు అమర్చారు. వాటిలో ఓనన్ మాత్రం సెప్టెంబర్ 24న రాజస్థాన్‌కు వచ్చింది. మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి ఏకంగా 5,426 కి.మీ.లు ప్రయాణించింది. ఇందులో 3500 కి.మీ.లు ఎక్కడా ఆగకుండా ప్రయాణించిన ఓనన్.. రెండు రోజుల్లోనే యెమెన్ నుంచి భారతదేశం చేరుకుంది. అంతేకాకుండా మొదటి ప్రయాణంలో ఎక్కువ దూరం వలస వచ్చిన ల్యాండ్ బర్డ్‌గా కుకూ రికార్డు సృష్టించింది. ఇందులో భాగంగా 26వేల కి.మీలను ప్రయాణించింది. తర్వాత మంగోలియా తిరిగి వెళ్లి అక్కడ గుడ్లు పెట్టి మళ్లీ ఆరు వారాల క్రితం తన రెండో ప్రయాణాన్ని మొదలుపెట్టిన కుకూ.. ఈ 3500 కి.మీ.ల కొత్త రికార్డును సృష్టించింది.

Advertisement

Next Story