- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అగస్టు 12న దుబాయ్ వెళ్లనున్న చెన్నై జట్టు
దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది యూఏఈలో ఐపీఎల్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ దుబాయ్ బాట పట్టనున్నాయి. కరోనాకు ముందే ప్రాక్టీస్ మొదలు పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ వాయిదా పడటంతో తమ శిక్షణా శిబిరాన్ని రద్దు చేసింది. ఇక ఇప్పుడు కూడా అందరి కంటే ముందుగానే యూఏఈ చేరుకోవడానికి సీఎస్కే జట్టు ప్రణాళికలు సిద్దం చేస్తున్నది.
అగస్టు 15లోపు ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని సీఎస్కే జట్టు యూఏఈ చేరుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆటగాళ్లను దుబాయ్ తీసుకెళ్లడానికి ఒక ప్రత్యేక విమానాన్ని బుక్ చేసినట్లు తెలుస్తున్నది. అగస్టు 10 లేగా 11న చెన్నై నుంచి ఈ జట్టు దుబాయ్ ప్రయాణమయ్యే అవకాశం ఉన్నట్లు జట్టు యాజమాన్యం చెబుతున్నది. కాగా, అగస్టు 2న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగిన అనంతరం సీఎస్కే జట్టు ప్రయాణ వివరాలు పూర్తిగా బయటకు వెలువరించే అవకావశం ఉంది. అగస్టు రెండో వారాంతలోగా సీఎస్కే జట్టు దుబాయ్‌లో శిక్షణ శిబిరాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ప్రారంభమయినా సరే.. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేయనున్నట్లు సీఎస్కే అధికారి ఒకరు తెలిపారు.