- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాధి క్యాలెండర్ రూపొందించాలి: సీఎస్
దిశ, న్యూస్‌బ్యూరో: ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉపాధి లభించేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఉపాధి పనుల అనుసంధానంపై గురువారం సీఎస్ సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల్లో అభివృద్ధి పనులు, ఉపాధి నిధుల అనుసంధానానికి ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. శాఖల్లో పనులను గుర్తించి ఉపాధిహామీ ద్వారా చేసేందుకు క్యాలెండర్ రూపొందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలు అధిక నిధులు పొందేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, గ్రామాల్లో వైకుంఠధామాలు, డంప్ యార్డుల పనులు చేపట్టడం, రైతు వేదికలు, గ్రామీణ పార్కుల పనులపై దృష్టి సారించాలన్నారు. ఉపాధిహామీ పనుల్లో వివిధ శాఖలు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో ఆర్థిక, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు రామకృష్ణారావు, సునీల్ శర్మ, రజత్ కుమార్, పీసీసీఎఫ్ శోభ, పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.