చమురు యుద్ధం ముగిసింది!

by Harish |
చమురు యుద్ధం ముగిసింది!
X

దిశ, వెబ్‌డేస్క్: ప్రపంచ మానవాళిపై భారీ విపత్తు కొనసాగుతున్న సమయంలో దేశాల మధ్య చమురు మంట రాజుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఉత్పత్తిని తగ్గించేందుకు సౌదీ అరేబియా, రష్యా దేశాల మధ్య నెలకొన్న చమురు యుద్ధం ముగిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ఉత్పత్తిని తగ్గించడమే ఉత్తమమైన మార్గమని చమురు ఎగుమతి దేశాల సంస్థ, రష్యాతో సహా కీలకమైన దేశాలన్నీ ఒప్పందాన్ని అంగీకరించాయి. ఇక నుంచి రోజుకు 9.7 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి. ముందుగా 10 మిలియన్ బ్యారెళ్లని ప్రకటించినప్పటికీ మెక్సికో వెనకడుగు వేయడంతో దీన్ని 9.7 మిలియన్లకు తగ్గించారు. తుది ఒప్పందం ఆదివారం ఖరారైనట్టు సమాచారం. ఈ అంశంపై అమెరిగా అధ్యక్షుడు ట్రంప్ ఒప్పందాన్ని స్వాగతించి సౌదీ, రష్యా దేశాలను అభినందించారు.

ఇటీవల అంతర్జాతీయంగా కొవిడ్-19 వ్యాప్తి పెరగడంతో సరఫరా లేకపోవడం, రవాణా పూర్తీగా నిలిచిపోవడంతో చమురుకు డిమాండ్ క్షీణించింది. దీంతో ధరలు తగ్గాన్ని నియంత్రించాలని దానికోసం ఉత్పత్తి తగ్గించాలంటూ సౌదీ అభిప్రాయపడింది. దీనికి రష్యా అడ్డుపడింది. ఉప్తత్తి తగ్గించే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పడంతో ఇరు దేశాల మధ్య చమురు యుద్ధం మొదలైంది. దీనికి ఆజ్యం పోస్తూ ధరలను అదుపులో ఉంచేందుకు రెండు దేశాలు ఇకరిని మించి మరొకరు చమురు ఉత్పత్తిని పెంచారు. ఈ పరిణామాలతో చమురు ధరలు భారీగా దిగజారాయి. ఈ ధరల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడింది. పరిస్థితి మరింత దారుణంగా మారకుండా ఉండేందుకు పలు దేశాధినేతలు చొరవ చూపడంతో ఇరు దేశాల మధ్య ఒప్పందం ఖరారైంది. దీంతో మళ్లీ చమురు ధరలు అదుపులోకొచ్చాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కాస్త పుంజుకుని డబ్ల్యూటీఐ బ్యారెల్ ధర 24.52 డాలర్లకు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ ధర 5 శాతం వరకూ పెరిగి బ్యారెల్‌కు 33.08 డాలర్లకు చేరింది.

Tags : Saudi Arabia, Brent, Crude Oil, Opec, WTI, Oil Prices

Advertisement

Next Story

Most Viewed