- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ కాకికి ఉన్నపాటి సెన్స్.. మనుషులకు లేదాయే!
దిశ, వెబ్ డెస్క్: మనుషులలో సామాజిక బాధ్యత తక్కువ అవుతుందని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కరోనా సమయంలో మాస్క్ లు పెట్టుకోవాలి.. సామాజిక దూరం పాటించాలి అన్నా కూడా చాలామంది వినరు. ఇక స్వచ్ఛ భారత్ పాటించండి.. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి అంటే ఎవరు వింటారు. కొన్నిసార్లు మనుషుల కంటే పక్షులు ఈ సామజిక బాధ్యతను ఎక్కువగా పాటిస్తున్నాయనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో పక్షులు ఎంతో తెలివిగా చేసే పనులు మనుషులకు ఒక కనువిప్పుగా మారుతున్నాయి. ఇటీవలే సామాజిక దూరం పాటిస్తున్న కొంగలు గురుంచి విన్నాం.. తాజాగా స్వచ్ఛ భారత్ పాటిస్తున్న ఈ కాకిని చూడండి.
This crow knows that humans have lost the sense of shame pic.twitter.com/9ULY7qH4T2
— Susanta Nanda IFS (@susantananda3) April 1, 2021
డస్ట్‌బిన్ పక్కనే ఉన్నా.. దాన్ని వినియోగించుకోకుండా పక్కన పారేసిన చెత్తను ఒక్కొక్కటిగా కాకి తన ముక్కుతో తీసుకొని డస్ట్‌బిన్‌లో వేస్తుంది. అలా చెత్త పేరుకుపోయి ఉన్న ఆ ప్రదేశాన్ని చక్కగా తయారుచేసిన వైనం ఔరా అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక‍్కర్లు కొడుతోంది. ఇక దీనిని చుసిన నెటిజన్లు ఆ కాకిని మెచ్చుకుంటున్నారు. మనుషులు మర్చిపోయిన స్వచ్ఛ భారత్ ని కాకి ఎంతో చక్కగా గుర్తుపెట్టుకుంది. కనీసం ఈ కాకి చేసిన పనిని చూసైనా మనం మారాలి అని కొందరు అంటుంటే… ఛీ.. ఛీ కాకికి ఉన్న సెన్స్ కూడా మనుషులకు లేకపాయె అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.