ఆలయంలో మొసలి.. పూజారి ఆదేశంతో వెనక్కి !

by Shamantha N |
ఆలయంలో మొసలి.. పూజారి ఆదేశంతో వెనక్కి !
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ కాసరగోడ్‌‌లోని శ్రీ అనంతపుర ఆలయంలోకి వెళ్లిన ఓ మొసలి.. పూజారి అభ్యర్థనతో వెనక్కి వెళ్లిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చాలా ఏళ్ల నుంచి ఎవరికి హానీచేయకుండా ఆలయంలోని సరస్సులో బాబియా అనే మొసలి ఉంటోంది. దానికి రోజూ రెండుపూటల ప్రసాదాన్ని పూజారి అందిస్తారు. సరస్సు దగ్గరకు వెళ్లి పిలవగానే పెట్టిన ప్రసాదాన్ని ఆరగిస్తోందని పూజారి, భక్తులు తెలిపారు. అయితే ఇటీవల సరస్సు నుంచి ఆలయంలోకి వచ్చిన మొసలిని తిరిగి వెళ్లిపోవాలని ప్రధాన అర్చకుడు చంద్రప్రకాశ్ నంబిసన్ కోరగా వెంటనే వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed