- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అనవసరంగా రోడ్లపైకి రాకండి.. భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ హెచ్చరిక
by Shyam |

X
దిశ, మునుగోడు: అనవసరంగా రోడ్లపైకి ఎవరు వచ్చిన కఠిన చర్యలు తీసుకుంటామని భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్ అన్నారు. గురువారం చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆయన లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. ఈపాస్ ఉన్నవారు తప్ప అనవసరంగా ఎవరూ బయటకు రావద్దని ఆయన ప్రజలకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి వచ్చిన వాహనదారులపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. ఆయన వెంట చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ ముని, పలువురు పోలీస్ అధికారులు ఉన్నారు.
Next Story