- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారుల సూచనలతో ఫోన్ ట్యాపింగ్ చేశా.. విచారణలో ప్రణీత్ రావు స్పష్టం
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మరికొన్ని గంటల్లో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ప్రత్యేక విచారణ బృందం మరింత ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎస్ఐబీ అదనపు ఎస్పీ తిరుపతన్నను బంజారాహిల్స్ స్టేషన్‌కు పిలిపించారు. ప్రణీత్ రావు, తిరుపతన్నను ముఖాముఖి కూర్చోబెట్టి దర్యాప్తు అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న ప్రణీత్ రావును వారం రోజులుగా ప్రత్యేక విచారణ బృందం విచారిస్తున్న విషయం తెలిసిందే.
దీంట్లో పై అధికారుల సూచనల మేరకే తాను ఫోన్ ట్యాపింగులు చేసినట్టు ప్రణీత్ రావు వెల్లడించాడు. ఈ క్రమంలోనే దర్యాప్తు బృందం అదనపు ఎస్పీ తిరుపతన్నను బంజారాహిల్స్ స్టేషన్‌కు పిలిపించింది. ఇద్దరిని ఒకే చోట కూర్చోబెట్టిన అధికారులు అసెంబ్లీ ఎన్నికలకు ఎన్ని రోజుల ముందు నుంచి ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగులు చేశాడు? మీరేమైనా ఆదేశాలు ఇచ్చారా? అని తిరుపతన్నను ప్రశ్నించినట్టు సమాచారం. అప్పట్లో ఎస్ఐబీలో కీలక స్థానంలో ఉన్న ప్రభాకర్ రావు పాత్రపై కూడా విచారించినట్టు తెలిసింది.