Jani Master Sexual Assault Case :జానీ మాస్టర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

by Sridhar Babu |   ( Updated:2024-09-18 15:12:57.0  )
Jani Master Sexual Assault Case :జానీ మాస్టర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
X

దిశ,గండిపేట్ : లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. నార్సింగి పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, బాధితురాలి స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. మరోవైపు సఖీ, భరోసా బృందాలు కూడా ఆమె నుంచి సమాచారం సేకరించాయి. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో యువతికి ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మరికొన్ని ఆధారాల కోసం ఇవాళ బుధవారం బాధితురాలి ఇంటికి పోలీసులు వెళ్లనున్నారు. అనంతరం కుటుంబ సభ్యుల నుంచి మరికొంత సమాచారం సేకరించనున్నారు.

ప్రస్తుతం తన వయసు 21సంవత్సరాలని, తాను మైనర్‌గా ఉన్నప్పట్నుంచీ జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. చెన్నై, ముంబైలలో ఔట్ డోర్ షూటింగ్స్‌లతోపాటు హైదరాబాద్ నార్సింగిలోని తన ఇంటిలో సైతం తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడి చేశాడని పేర్కొంది. కాగా ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసుని రాయదుర్గం పోలీసులు అక్కడికి బదిలీ చేశారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వేగవంతం చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ యువతి ఫిర్యాదు మేరకు ఈనెల 16న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అత్యాచారంతోపాటు బెదిరించి కొట్టాడంటూ బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. దాంతో నార్సింగి పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.

Advertisement
Next Story

Most Viewed