చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక రైతుసంఘం మాజీ అధ్యక్షులు మృతి

by Sumithra |   ( Updated:2023-09-18 12:21:51.0  )
చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక రైతుసంఘం మాజీ అధ్యక్షులు మృతి
X

దిశ, కోదాడ : తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు నారాచంద్రబాబునాయుడిని కక్షపూరితంగా అరెస్టు చేసి ఇబ్బందుకు గురి చేస్తున్న తీరును టివీలో చూసి తట్టుకోలేక నడిగూడెం మండలం తెలుగుదేశం పార్టీ మాజీ రైతు సంఘం అధ్యక్షులు కొల్లు లక్ష్మయ్య గుండెపోటుతో కోదాడ పట్టణంలోని వెంకటేశ్వరనగర్ లో ఆయన నివాసంలో మృతి చెందారు. కాగా సోమవారం తెలుగుదేశం పార్టీ రైతుసంఘం రాష్ట ఉపాద్యక్షులు ఉన్నం హన్మంతరావు మృతదేహాన్ని సందర్శించి తెలుగుదేశంపార్టీ జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు రైతుసంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు, కోదాడ పట్టణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు ఉప్పుగండ్ల శ్రీనివాసరావు, కొల్లు క్షత్రయ, నడిగూడెం మండల పార్టీ అధ్యక్షులు దొంతగాని శ్రీను, ప్రధాన కార్యదర్శిపల్లపు నాగేశ్వరావు, ఉపాద్యక్షులు బూరుగడ్డ థామస్, జిల్లానాయకులు వి.ఎల్ .ఎన్ గౌడ్, కొల్లు గణేష్, షేక్ రఫీ, షేక్ షహీమ్, పల్లెలు శ్రీను, పల్లపు తిరుమలేష్, దేవరంగు వీరన్న, సీతయ్య, కొల్లురామయ్య, కొల్లు నాగేశ్వరావు, కందుల అనిల్ కుమార్, కొల్లు ప్రసాద్, కొల్లు నర్సింహరావు, లక్మయ్య నివాళులు అర్పించారు.

Advertisement

Next Story