- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Cybercrime : మెసేజ్ ఓపెన్ చేయగానే డబ్బులు స్వాహా
దిశ, మహబూబాబాద్ టౌన్ : మెసేజ్ ఓపెన్ చేయగానే 92 వేల రూపాయలు బ్యాంకు ఖాతా నుంచి కట్ అయిన ఉదంతం ఇది. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని వీణ కంగన్ హాల్ యజమాని శేషగాని శ్రీనివాస్ బ్యాంక్ అకౌంట్ నుండి సైబర్ కేటుగాళ్లు 92 రూపాయలు కాజేశారు. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వరుసగా మెసేజ్ వస్తుండడంతో ఏమిటా అని మెసేజ్లను ఓపెన్ చేయగా 8 గంటల ప్రాంతంలో 60,000 మరోసారి 32,000 నగదు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుండి 97158008352 నెంబర్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయని బాధితుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.
సైబర్ క్రైమ్ నెంబర్(1930) కి కాల్ చేసి సంబంధిత ఆధారాలు వాట్సాప్ ద్వారా అందజేశామని అందజేసిన స్క్రీన్ షాట్స్ కూడా వాటంతట అవే ఫార్వర్డ్ అవుతున్నాయన్నారు. తాను ఎటువంటి ఓటీపీలు చెప్పడం కానీ లింకులు ఓపెన్ చేయడం కానీ చేయలేదని, పోయిన నగదు తిరిగి అకౌంట్లో జమ అవుతుందో లేదో అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఉదయం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. సైబర్ నేరగాళ్లు ఫోన్ హ్యాక్ చేసి ఉండవచ్చు అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
Read More..
- Tags
- Cybercrime