Road Accident: స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ.. చికిత్స పొందుతూ విద్యార్థిని దుర్మరణం

by Shiva |   ( Updated:2024-08-17 05:07:04.0  )
Road Accident: స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ.. చికిత్స పొందుతూ విద్యార్థిని దుర్మరణం
X

దిశ, సికింద్రాబాద్/ఉప్పల్: స్కూల్ ఆటోను లారీ ఢీకొట్టిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడ చౌరస్తాలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. తార్నాకలోని కిమితి కాలనీకి చెందిన సాత్విక అనే విద్యార్థిని హబ్సిగుడాలోని గౌతమ్ మోడల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది. స్కూల్‌కు వెళ్లేందుకు ఉదయం 8 గంటల ప్రాంతంలో సాత్విక ఆటోలో బయలుదేరింది. హబ్సిగూడ చౌరస్తా‌లో సిగ్నల్ పడడంతో ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బస్సు కింది భాగంలోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో ఆటోను బయటకు తీసి అందులో ఉన్న డ్రైవర్ ఎల్లయ్య, విద్యార్థిని సాత్వికను నాచారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ విద్యార్థిని స్వాతిక మృతి చెందింది, ఆటో డ్రైవర్ ఎల్లయ్య పరిస్థితి విషమంగా ఉంది.



Next Story

Most Viewed