అప్పుల భారంతో యువకుడు ఆత్మహత్య

by Kalyani |
అప్పుల భారంతో యువకుడు ఆత్మహత్య
X

దిశ, మెదక్ ప్రతినిధి : అప్పుల భారంతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ పట్టణం బరా హిమాం వద్ద శనివారం జరిగింది. మెదక్ పట్టణానికి చెందిన ఆమ్లిపూర్ అరవింద్(24) ఆర్టీసీ లో రెగ్సీన్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా తల్లి శాంతమ్మ ఆరోగ్యం బాగా లేక పోవడం తో వైద్యం కోసం దాదాపు 3 లక్షల అప్పు చేశాడు. దీంతో కొంత కాలంగా చేసిన అప్పులు ఎలా తీర్చాలి అని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం సాయంత్రం ఇప్పుడే వస్తా అని ఇంట్లో చెప్పిన అరవింద్ రాత్రి 11 గంటల వరకు రాలేదు. రాత్రంతా వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఉదయం కాలనీ సమీపంలో పాడుబడిన ఇంటి వద్ద గల వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పడంతో కుటుంబీకులు వెళ్లి చూడగా అరవింద్ మృతి చెంది ఉన్నాడు. తలపై గాయం ఉండడం తో కొంత అనుమానం వ్యక్తం చేశాడు. అప్పుల భారం తోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ నాగరాజు తెలిపారు.

Next Story

Most Viewed