- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Woman Attacks Husband: భర్త ప్రైవేట్ పార్ట్ కట్ చేసి ఫరారైన భార్య
దిశ, వెబ్‌డెస్క్: భర్తను చంపి పారిపోయిన భార్య ఘటన గురించి మరిచిపోకముందే దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరో దారుణమైన ఘటన వెలుగులోకొచ్చింది. ఓ భార్య తన భర్త ప్రైవేట్ పార్ట్ (Private part)ని కోసి ఇంటి నుంచి పరారైపోయింది. ఈ ఘటన శుక్రవారం నాడు నార్త్ ఢిల్లీలోని రూప్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 1న పోలీస్ స్టేషన్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. భార్య తన ప్రైవేట్ పార్ట్ కోసి ఫరారైపోయిందని, తనను కాపాడాలని ఆ వ్యక్తి వేడుకున్నాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రక్తపుమడుగులో పడి ఉన్న అతడిని వెంటనే సఫ్‌దర్‌జంగ్ ఆసుపత్రి (Hospital)కి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు.
కాగా.. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని చెప్పిన పోలీసులు.. బాధితుడు కోలుకోగానే అతడి రాతపూర్వక ఫిర్యాదును స్వీకరించి.. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే యువకుడి భార్య కోసం మాత్రం వెతుకుతున్నారు. ఇక భార్య ఇలా చేయడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని మాత్రం తెలుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవలే ఢిల్లీలోని ద్వారకా జిల్లాలో ఓ మహిళ ఏకంగా తన భర్తను చంపి ఇంట్లో శవాన్ని దాచి ఇంటికి తాళం వేసి పారిపోయింది. ఆగస్టు 20న ఇంటి చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు కాల్ చేసి మూసి ఉన్న ఇంట్లో నుంచి దారుణమైన దుర్వాసన (Bad Smell) వస్తోందని చెప్పడంతో ఆ హత్యోదంతం వెలుగులోకొచ్చింది.