- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విద్యుత్ హైఓల్టేజీతో ఏసీ పేలీ మహిళ మృతి
by Anjali |

X
దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ హైఓల్టేజీలో ఏసీ పేలీ 52 ఏళ్ల మహిళ మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. దామర్ల శ్రీదేవి భర్త గత 4 ఏళ్ల క్రితం చనిపోయాడు. భర్త మరణంతో కారుణ్య నియమకాల కింది జడ్పీ కార్యాలయంలో పీఎఫ్ విభాగంలో ఉద్యోగాన్ని పొందింది. అయితే శ్రీదేవి, ఆమె కుమారుడు సాయితేజ ఈ నెల(మే 28)న రాత్రి ఇంట్లో ఏసీ వేసుకుని నిద్రిస్తున్నారు. కాగా హైఓల్టేజీ కరెంటు వల్ల ఏసీ పేలింది. దీంతో ఏసీ నుంచి విడుదలైన వాయువులను పీల్చడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు వారిని హాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ శ్రీదేవి మరణించింది. ప్రస్తుతం ఆమె కుమారుడికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.
Next Story