- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మేడిపల్లిలో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి దుర్మరణం
by Sridhar Babu |

X
దిశ, మేడిపల్లి : ఆర్టీసీ బస్సు ఢీకొని 7వ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి కాచవానిసింగారం గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. స్కూటీపై పదవ తరగతి బాలుడు అభిలాష్, ఏడవ తరగతి బాలుడు అక్షిత్(13) ఇద్దరూ కలిసి వెళ్తుండగా కాచివానిసింగారం మణిదీప కాలనీ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. దాంతో అక్షిత్ మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు.
Next Story