- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోటల్లో టిఫిన్ తిని స్పూన్లు, ప్లేట్లు ఎత్తుకెళ్తున్న కస్టమర్లు..! బోర్డు పెట్టి మరీ చెప్పారట!!
దిశ, వెబ్‌డెస్క్ : ఎవరైనా దొంగలు డబ్బులు, బంగారం, విలువైన వస్తువులు, వాహనాలు ఇలా ముఖ్యమైన వాటిని దొంగతనం చేయడం పరిపాటి. కానీ ఓ క్యాంటీన్‌లో మాత్రం ఓ దొంగోడు టిఫిన్ చేయడానికి వచ్చి రోజుకో ప్లేట్, గ్లాస్, స్పూన్ చొప్పున చాలానే వస్తువులను మాయం చేశారంట. దాంతో హోటల్ యాజమాన్యం ‘క్యాంటీన్‌లో చెంచాలు, ప్లేట్లు, గ్లాసులు కనిపించడం లేదు. ఎవరూ బయటికి తీసుకెళ్లొద్దు’ అని ఓ నోటీసు బోర్టు పెట్టిందట. అయితే ఈ విచిత్రకరమైన సంఘటన ముంబైలో వెలుగుచూసింది.
ముంబైలోని ఛత్రపతి శివాజి టర్మినల్ సమీపంలో ఉండే ఓ క్యాంటీన్‌లో సుమారుగా 6 వేల స్పూన్‌లు, 400 పేట్లు, 100కి పైగా గ్లాసులు ఉండేవట. అయితే ఓ వ్యక్తి టిఫిన్ చేయడానికి వచ్చి ప్లేట్లు, స్పూన్‌లు, గ్లాసులు మాయం చేయడం ప్రారంభించి కొద్దిరోజుల వ్యవధిలోనే మొత్తం మాయం చేశాడట. అది గమనించిన యాజమాన్యం ఇన్ని వస్తువులు ఎలా చోరీకి గురయ్యాయే అంటూ బాధపడ్డారు. ఆ తరువాత ఓ వినూత్న ఆలోచన చేసి క్యాంటీన్‌లో చెంచాలు, ప్లేట్లు, గ్లాసులు కనిపించడం లేదు. ఎవరూ బయటికి తీసుకెళ్లొద్దు అని ఓ నోటీసు బోర్టు పెట్టిందట. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఆ దొంగపై మాత్రం పోలీస్ కేసు పెట్టలేదట.