రాముని పట్లలో చోరీ.. భారీ మొత్తంలో బంగారం, వెండి అపహరణ

by Hamsa |
రాముని పట్లలో చోరీ.. భారీ మొత్తంలో బంగారం, వెండి అపహరణ
X

దిశ, చిన్న కోడూరు: మండల పరిధిలోని రాముని పట్ల గ్రామంలో బుధవారం రాత్రి గ్రామంలోని పంతం కవిత ఇంట్లో దొంగతనం జరిగింది. కవిత బుధవారం రోజు బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంటికి తాళం వేసి ఉందని గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇల్లు నిండా కారం పొడి చల్లి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటి పక్కనే ఉన్న వాసవి కొమురయ్య వ్యవసాయ పొలంలో తన పాడి గేదెను కట్టేసిన గడ్డపారను తీసుకువచ్చి ఇంటి తలుపులు పగలగొట్టారు. సుమారుగా 6 తులాల బంగారం 50 తులాల వెండిని ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. సంఘటన స్థలానికి క్లూస్ టీం చేరుకొని ఫింగర్ ప్రింట్స్ ను పరిశీలిస్తున్నారు. చిన్నకోడూరు ఎస్ ఐ శివానందం రెండు లక్షల నగదు కొంత బంగారాన్ని వదిలి వెళ్లినట్లు తెలిపారు మరిన్ని వివరాలు తర్వాత వెల్లడిస్తామన్నారు.

Advertisement

Next Story