నన్ను వేధిస్తున్నారు.. వైద్య శాఖలో ANM వాయిస్ మెసేజ్ కలకలం (ఆడియో)

by Nagaya |   ( Updated:2023-05-19 06:58:40.0  )
నన్ను వేధిస్తున్నారు.. వైద్య శాఖలో ANM వాయిస్ మెసేజ్ కలకలం (ఆడియో)
X

దిశ, మెదక్ ప్రతినిధి : వైద్య శాఖలో ఓ ఏఎన్ఎం వాయిస్ మెసేజ్ కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా తనను పీడిస్తున్నారని... ఎవరు సహకరించకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ వాపోయింది. దీనివల్ల తాను కుంగిపోయానని ఇందుకు కారణమైన వారి పేర్లు సూసైడ్ నోట్లో రాసి ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆ ఏఎన్ఎం వైద్య శాఖ గ్రూపులో మెసేజ్ పెట్టడంతో అంతా షాక్ అయ్యారు. అయితే మెసేజ్ ఎప్పుడు పెట్టిందో అధికారులు సమాచారం ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆమె మాట్లాడిన వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. అందులో ఏఎన్ఎం మాట్లాడిన మాటలు ఈ విధంగా ఉన్నాయి.

కౌడిపల్లి గ్రూపులో ఉన్న మెడికల్ ఆఫీసర్‌కు, సూపర్వైజర్లకు నా మనవి.. నా పేరు సుధామణి (పేరు మార్చాం). గత 20 సంవత్సరాలుగా కౌడిపల్లి పీఎస్ పరిధిలో పనిచేస్తున్నాను. కానీ ఏ రోజు కూడా పనికి భయపడలేదు. ఎవరు ఏ పని చెప్పినా చేసి ఇంతవరకు నెట్టుకొచ్చాను.. గత వారం రోజులుగా తనను చాలా పీడిస్తున్నారు. నా బాధ అందరికీ చెప్పుకున్నాను. సూపర్వైజర్, మెడికల్ ఆఫీసర్లకు చెప్పాను. తన సెకండ్ ఏఎన్ఎం 10 సంవత్సరాల క్రితం వచ్చినా ఎప్పుడూ సబ్ సెంటర్లో పనిచేయలేదు.. డీపీఎల్ క్యాంప్‌లో పని చేసింది. అంతకు ముందు పీహెచ్‌సీలోనే వర్క్ చేసింది. ఏనాడు వెనక అడుగు వేయలేదు. సాధ్యమైనంత వరకు పని చేశాను.. కానీ మానసికంగా కుంగదీస్తున్నారు. నాకు పైనుంచి ప్రెషర్ ఉందని వేడుకున్నాను. ఆశా వర్కర్లు లేరు.. చదువు రాని ఆశాతో ఇప్పటి వరకు తీసుకు వచ్చాను. మూడు, నాలుగు రోజులుగా డీఎంహెచ్‌వో పిలిపించి వర్క్ సబ్ సెంటర్‌లో వర్క్ కాకపోతే వేతనం కట్ చేస్తానని చెప్పారు. జీతం కట్ చేసిన బాధలేదు. కానీ నన్ను మానసికంగా అందరూ ఎలా చేస్తున్నారో అర్థమైంది. అందుకే మెసేజ్ పెట్టి లెటర్ రాసి సూసైడ్ చేసుకుంటున్నాను.. నా చావుకి కారణం ఎవరో రాసి పెడతాను.. ఎందుకంటే నేను ఎవరితో మాట పడలేదు. కుటుంబంలో కూడా ఎవరు మాట అనలేదు. డ్యూటీలో నాలుగు రోజులుగా కుంగిపోతున్నాను. ఇంత పని చేసినా సహకరించడం లేదు. ఒక ఆశ, ఒక ఏఎన్ఎం ఇవ్వాలని బతిమిలాడాను. ప్రతి మీటింగ్‌లో మొత్తుకున్నా నామాట ఎవరు లెక్క చేయడం లేదు.. అందుకే నేను సూసైడ్ చేసుకుంటానని కన్నీరు పెట్టుకుంది.

ఇది ఎప్పుడూ జరిగింది అన్నది అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఏఎన్ఎం కూడా అందుబాటులోకి రావడం లేదు. కానీ ఆమె పెట్టిన కన్నీరు మెసేజ్ మాత్రం పలువురిని ఆవేదన గురి చేసేలా ఉంది. మరి దీనిపై వైద్యశాఖ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

మహిళా అధికారిణితో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ రాసలీలలు.. నెట్టింట్లో వీడియోలు వైరల్

భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే ఇవి చేయాల్సిందే..

BRS Party: బాటలో తెలంగాణ జాగృతి..? MLC Kavitha పక్కా ప్లాన్ వేశారా..?

Advertisement

Next Story