- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిద్రిస్తున్న రైతుపై నుంచి వెళ్లిన ట్రాక్టర్
ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే అసువులుబాసిన రైతన్న
దిశ, తిమ్మాపూర్ : నిద్రిస్తున్న రైతుపై నుంచి ట్రాక్టర్ వెళ్లిన ఘటన తిమ్మాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని వచ్చునూర్ గ్రామానికి చెందిన రైతు ఉప్పులేటి మొండయ్య తాను పండించిన పంటను అమ్ముకునేందుకు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లాడు. శనివారం రాత్రి కొనుగోలు కేంద్రంలోనే టార్ఫాలిన్ ను నిండుగా కప్పుకొని పడుకున్నాడు. శనివారం తెల్లవారుజామున ధాన్యం లోడ్ తో వచ్చిన ట్రాక్టర్ డ్రైవర్ మొండయ్యను గమనించకుండా ట్రాక్టర్ ఎక్కించాడు. దీంతో మొండయ్య కు తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరకున్న ఆర్డీవో ఆనంద్ కుమార్, తహసీల్దార్ కనకయ్య, ఎస్సై శీలం ప్రమోద్ రెడ్డి బాధితులతో మాట్లాడి మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.