చెట్టును ఢీకొట్టిన బైక్.. వ్యక్తి దుర్మరణం

by Shiva |   ( Updated:2023-06-04 12:27:49.0  )
చెట్టును ఢీకొట్టిన బైక్.. వ్యక్తి దుర్మరణం
X

దిశ, దౌల్తాబాద్ : బైకు అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చెట్లనర్సంపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. చెట్లనర్సంపల్లి గ్రామానికి చెందిన చిన్నముల్ల యాదగిరి (46) ఆదివారం ఉదయం పొలం పనుల నిమిత్తం వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాతంలో యాదగిరి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story