Terrible Tragedy: రాష్ట్రంలో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్‌తో నలుగురు మృతి, ఒకరి పరిస్థితి విషమం

by Shiva |
Terrible Tragedy: రాష్ట్రంలో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్‌తో నలుగురు మృతి, ఒకరి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్‌డెస్క్: కరెంట్ షాక్‌ (Current Shock)తో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh State)లోని తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) ఉండ్రాజవరం (Vundrajavaram) మండలం తాడిపర్రు (Thadiparru) గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఫ్లెక్సీ కడుతుండగా.. ఆ పైనే ఉన్న హైటెన్షన్లు వైర్లు తగిలి గ్రామానికి చెందిన యువకులు వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఉండ్రాజవరం పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Next Story

Most Viewed