ఉగ్రదాడిలో ఏపీకి చెందిన జవాన్ వీర మరణం

by Javid Pasha |
ఉగ్రదాడిలో ఏపీకి చెందిన జవాన్ వీర మరణం
X

దిశ, కర్నూలు ప్రతినిధి : నంద్యాల జిల్లా పాములపాడు మండలం కృష్ణానగర్ గ్రామానికి చెందిన వీర జవాన్ సురేంద్ర సోమవారం జరిగిన ఉగ్ర దాడిలో వీర మరణం పొందారు. గ్రామానికి చెందిన సుబ్బయ్య సుబ్బమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అందులో చిన్న కుమారుడైన సిరిగిరి సురేంద్ర (24) గత ఐదేళ్లుగా ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. నాగ్ పూర్ లో శిక్షణ పూర్తి చేసుకుని గాడ్జ్ రెజిమెంటల్ సెంటర్ లో శిక్షణ పూర్తి చేసుకుని బదునాకు వెళ్లారు. అయితే ఈ మధ్య కాలంలో బదునా నుంచి కాశ్మీర్ లోని బారాముల జిల్లాలోని ఆర్మీ బెటాలియన్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ బార్డర్ లో విధులు నిర్వహిస్తుండగా జూలై 31వ తేది మధ్యాహ్నం ఉగ్రవాదులు ట్రక్ పై దాడి చేశారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం కాశ్మీర్ కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఆర్మీ జవాన్ మృతితో మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నేడు మృతుడి పార్థవ దేహాన్ని స్వగ్రామానికి తీసుకు రానున్నారు. అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రెండు నెలల క్రితం సెలవులకు వచ్చి అందరితో సరదాగా గడిపిన మృతుడు ఈ మధ్య కాలంలోనే విధులకు వెళ్లి మృత్యు ఒడి చేరడం పలువురిని కలచివేసింది.

Advertisement

Next Story