- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలా చంపుతాడో శ్రద్ధకు ముందే చెప్పిన అప్తాబ్.. సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు!
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ మర్డర్ కేసులో తాజాగా మరికొన్ని సంచలన విషయాలు పోలీసులు వెల్లడించారు. మంగళవారం ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టులో శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణ జరిగింది. శ్రద్ధా ప్రియుడు అప్తాబ్ ఆమెను క్షణికావేశంలో హత్య చేయలేదని.. ప్లాన్డ్‌గానే మర్డర్ చేశాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. పోలీసుల తరుఫున న్యాయవాది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ ప్రసాద్ కోర్టులో వాదనలు వినిపించారు.
అప్తాబ్ శ్రద్ధాను ప్లాన్ ప్రకారమే హతమార్చాడని.. అంతేకాకుండా ఎలా హత్య చేస్తాడో అప్తాబ్ శ్రద్ధాకు ముందే చెప్పాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. గొంతు నులిమి చంపి.. శరీర భాగాలను కోసి హత్య చేస్తానని బెదిరించడంతో శ్రద్ధా మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. చెప్పినట్లుగానే అప్తాబ్ శ్రద్దను గొంతు నులిమి హత్య చేసి.. అనంతరం శరీరాన్ని ముక్కులుగా కోసి దాచి పెట్టాడని తెలిపారు.
అంతేకాకుండా అప్తాబ్, శ్రద్ధా మధ్య ఎప్పుడు గొడవలు జరిగేవని.. కానీ ప్రేమ కోసం శ్రద్ధా సైలెంట్‌గా ఉండేదన్నారు. అప్తాబ్ గతంలో హోటల్ శిక్షణ పొందటంతో అతడికి శరీర భాగాలు పాడవకుండా ఎలా దాచాలో బాగా తెలుసని.. అందుకే డబుల్ డోర్ ప్రిజ్ కొనుగోలు చేసి శ్రద్ధా శరీర భాగాలను అందులో దాచిపెట్టాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు. ఆఫ్తాబ్ తరఫున లీగల్ ఎయిడ్ న్యాయవాది జావెద్ హుస్సేన్, మరో లాయర్ సీమా కుష్వాహ హాజరయ్యారు. వాదనల అనంతరం కేసును మార్చి 20వ తేదీకి వాయిదా వేశారు.