Saroornagar Apsara Murder: అప్సర హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

by Javid Pasha |   ( Updated:9 Jun 2023 1:05 PM  )
Saroornagar Apsara Murder: అప్సర హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రియుడి చేతిలో హత్యకు గురైన అప్సర కేసు విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్సరను హత్య చేసేందుకు ప్రియుడు సాయికృష్ణ కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసుల వివరాల ప్రకారం.. తాను కోయంబత్తూర్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వచ్చిన అప్సరను ప్రియుడు సాయికృష్ణ తన ఫోర్డ్ కారులో ఎక్కించుకొని సరూర్ నగర్ వైపు కు బయలు దేరాడు. ఈ క్రమంలోనే రాళ్లగూడలో వారిద్దరూ కలిసి భోజనం చేశారు.

భోజనం చేసిన తర్వాత కారులో రిలాక్స్ అవుతున్న అప్సరసపై సాయికృష్ణ ఒక్కసారిగా దుడ్డుకర్రతో దాడి చేశాడు. అనంతరం ఆమె డెడ్ బాడీని కారు డిక్కీలో వేసి రోజంతా ఇంటి ముందే పార్కింగ్ చేశాడు. అనంతరం మరుసటి రోజు మ్యాన్ హోల్ లో పడేశాడు. కాగా తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడం వల్లే అప్సరను హత్య చేసినట్లు సాయికృష్ణ పోలీసుల వద్ద ఒప్పుకున్నట్లు సమాచారం.

Saroornagar Apsara Murder

Next Story

Most Viewed